హైదరాబాద్, అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ మాములుగా లేదుగా? తొలి ఇండియన్ చిత్రంగా రికార్డు!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25న సినిమా విడుదలవుతుంది. సినిమా రిలీజ్ ముందు యు.ఎస్‌లో ప్రీమియర్స్‌కు రెండు మిలియన్ డాలర్స్ మార్క్‌ను టచ్ చేసింది. ఈ మార్క్ టచ్ చేసిన తొలి ఇండియన్ మూవీగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది.బాహుబలితో తెలుగు సినిమా రేంజ్‌ను ప్రపంచానికి చాటిన దర్శకుడు రాజమౌళి. ఆయన్నుంచి నెక్ట్స్ మూవీ ఎలా ఉంటుందోనని అప్పట్లో తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. నిజంగానే ఎవరూ ఊహించని విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ సినిమాను అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు. ఇక ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ప్రోమోలు, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నివిషయాలతో ఫ్యాన్స్‌ను, ఆడియెన్స్‌ను అలరిస్తూ వచ్చారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ భారీ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఏదైతేనేం ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండమైన రిలీజ్‌కు సిద్ధమవుతుంది. బాహుబలితో బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారోనిన ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూడసాగాయి.
అందరూ ఊహించినట్లే రాజమౌళి.. రామారావు.. రామ్ చరణ్.. ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ కొత్త రికార్డుల వేటను ప్రారంభించింది. లేటెస్ట్ సమాచారం మేరకు.. ఓవర్ సీస్ విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఇప్పటికే రెండు మిలియన్స్‌ను క్రాస్ చేసేసింది. మూడు మిలియన్ డాలర్స్ దిశగా అడుగులు వేస్తుంది. రిలీజ్ సమయానికి అది మూడు మిలియన్ మార్క్‌ను దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే ఓవర్ సీస్లో ప్రీమియర్స్‌కే ఆర్ఆర్ఆర్ రూ.20 కోట్ల వసూళ్లను రాబడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రీమియర్స్ పరంగా రెండు మిలియన్ డాలర్స్ మార్కును చేరడం అనేది ఆర్ఆర్ఆర్ సాధించిన తొలి రికార్డ్. ఈ రికార్డ్‌ను సాధించిన తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే కావడం విశేషం..
చిత్ర పరిశ్రమతో పాటు ఇతర రంగాల్లోని వారు, సాధారణ ఆడియెన్స్ అందరూ ట్రిపుల్ ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. తొలిరోజు, తొలి ఆటకే ఆర్ఆర్ఆర్ చూడాలని ఇటు మెగా ఫ్యాన్స్..అటు నందమూరి ఫ్యాన్స్ పోటీలు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో ఐదు ఆటలకు అనుమతి ఇచ్చారు కానీ.. బెనిఫిట్ షోకు అనుమతి లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినట్లు కనిపిస్తోంది.సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు.. ఆర్ఆర్ఆర్ కోసం హైదరాబాద్‌లో దాదాపు పదిహేను చోట్ల బెనిఫిట్ షో పడుతుంది. ఉదయం నాలుగు గంటలకు ఈ షో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ బెనిఫిట్ షోలను హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రదర్శిస్తున్నారు. ఈ షోస్ టికెట్స్‌ను సొంతం చేసుకోవడానికి అభిమానులు పోటీ పడుతున్నారు. బయటకు వచ్చిన వార్తల మేరకు ఒక్కో టికెట్ ధర మూడు నుంచి ఐదు వేలు పలుకుతుందట. ఓ బెనిఫిట్ షోకు ఈ రేంజ్లో ధరలను పెట్టి టికెట్స్ అమ్మడం వాటి కోసం ఫ్యాన్స్ పోటీలు పడటం టాలీవుడ్లో ఇదే తొలిసారిగా అనుకోవాలంతే ఇక ఓవర్ సీస్లోనూ ఆర్ఆర్ఆర్ ఫీవర్ పీక్స్‌లో ఉంది. ప్రీమియర్ షోకు ఇప్పటికే రెండు మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. ఇది మూడు మిలియన్స్‌కు టచ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.













