Bommarillu Bhaskar: పవన్ మెచ్చిన కథను పక్కన పెట్టిన డైరెక్టర్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan) ఓ వైపు రాజకీయాలతో పాటూ మరోవైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల పవన్ సినిమాలను అనుకున్న టైమ్ కు పూర్తి చేయలేకపోతున్నాడు. లేదంటే ఆయన కమిట్ అయిన సినిమాలు ఎప్పుడో పూర్తి కావాల్సింది. ఇదిలా ఉంటే పవన్ ఓకే అంటే ఇప్పటికిప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు క్యూ కడతారనే విషయం తెలిసిందే.
కానీ ఆయనకు అంత తీరిక లేదు. ఇలాంటి టైమ్ లో పవన్ కు తాను గతంలో ఓ కథ చెప్పానంటోన్నాడు బొమ్మరిల్లు భాస్కర్(bommarillu bhaskar). ఆయన రీసెంట్ గా సిద్దు జొన్నలగడ్డ(siddhu Jonnalagadda)తో తీసిన జాక్(jack) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆరెంజ్(Oragne) సినిమా టైమ్ లోనే పవన్ కళ్యాణ్ కు ఓ కథ చెప్పానని బొమ్మరిల్లు భాస్కర్ తెలిపాడు.
తాను పవన్ కు చెప్పిన కథ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని, ఆ కథ విన్నాక పవన్ ఇలాంటి కథలు కూడా రాస్తారా? చాలా కొత్తగా బావుందని మెచ్చుకున్నారని, కానీ తానే ఆ కథను పక్కన పెట్టానని, దాన్ని పూర్తి చేయాలంటే తనకు జీవితంలో చాలా అనుభవాలు కావాలనిపించిందని, ఆ అనుభవాలే కథకు ఎంతో పనికొస్తాయనిపించిందని, ఇప్పుడు తనకు ఆ అనుభవం వచ్చిందని, అందుకే ఆ కథను పూర్తి చేశానని భాస్కర్ తెలిపాడు. మరి ఆ కథను భాస్కర్ పవన్ కళ్యాణ్ తోనే చేస్తాడా లేదా మరో హీరోతో చేస్తాడా అన్నది చూడాలి.













