కొత్త జానర్ తో రానున్న బొమ్మరిల్లు భాస్కర్
మొదటి సినిమా బొమ్మరిల్లుతోనే తన పేరును బొమ్మరిల్లు భాస్కర్ గా మార్చుకున్నాడు ఆ దర్శకుడు. ఆ తర్వాత రెండో సినిమాగా తీసిన పరుగు కూడా భాస్కర్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది. కానీ మూడో సినిమా ఆరెంజ్ మాత్రం దర్శకుడిగా తనకు, నిర్మాతగా నాగబాబుకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆరెంజ్ సినిమా వల్ల నాగబాబు ఎంతో నష్టపోయాడు.
కానీ ఆ సినిమాను రీరిలీజ్ చేసినప్పుడు ఆడియన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొన్నా మధ్య అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు భాస్కర్, సిద్దూ జొన్నలగడ్డతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటిలానే ఈ సారి కూడా భాస్కర్ లవ్ స్టోరీతోనో, ఫ్యామిలీ మూవీనో చేస్తాడనుకున్నారంతా.
కానీ తను మాత్రం ఈసారి తన స్టైల్ కు భిన్నంగా కొత్త కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. జాక్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా స్పై కామెడీ జానర్ లో తెరకెక్కనున్నట్లు సమాచారం. అంతేకాకుండా సినిమాలో యాక్షన్ డోస్ కూడా బాగా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. భాస్కర్ నుంచి ఈ జానర్ సినిమా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి ఇది పెద్ద ట్విస్టనే చెప్పాలి. సిద్దూ కోసం తన రూటును మార్చి కొత్త జానర్ లో సినిమా చేస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.













