New Trend: భారీ ప్రాజెక్టులను మిస్ చేసుకున్న బాలీవుడ్ స్టార్లు

ఇండస్ట్రీలో అనుకున్నది జరగాలని లేదు. ఒకరితో మొదలుపెట్టిన సినిమా మరొకరు చేయడం, అనౌన్స్ అయిన సినిమాలు కూడా ఆగిపోవడం జరుగుతుంటాయి. ఈ మధ్య బాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ వచ్చింది. ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కమిట్ అయన భారీ బడ్జెట్ ప్రాజెక్టుల నుంచి కొంత మంది బాలీవుడ్ నటీనటులు తప్పుకోవడం అందరికీ షాకిస్తోంది.
అలా భారీ సినిమాల్లో ఛాన్సులను మిస్ చేసుకున్న సెలబ్రిటీలు బాలీవుడ్ లో ఎంతోమంది ఉన్నారు. హేరా ఫేరి3(Hera Pheri3) నుంచి పరేల్ రావల్(Parel Rawal) తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అక్షయ్ కుమార్(Akshay Kumar) అతనిపై రూ.25 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తూ కేసు కూడా ఫైల్ చేశాడని బాలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం(Ramayanam)లో సీతగా మొదట ఆలియా భట్(Alia Bhatt) ఒప్పుకుంది కానీ తర్వాత కొన్ని కమింట్‌మెంట్స్ వల్ల ఆ సినిమా నుంచి తప్పుకుంది.
ఇక రీసెంట్ గా ప్రభాస్(Prabhas) స్పిరిట్(Spirit) సినిమా నుంచి దీపికా(Deepika Padukone) స్థానంలో త్రిప్తి డిమ్రీ(Tripthi Dimri)ని తీసుకున్న సంగతి తెలిసిందే. తనకు వెన్నుపోటు పొడిచి స్టోరీని లీక్ చేశారని ఫైర్ అవుతూ సందీప్(Sandeep Reddy Vanga) ఈ విషయంలో ట్వీట్ కూడా చేశాడు. ఇక యష్ (Yash)నటిస్తున్న టాక్సిక్(Toxic) నుంచి కరీనా కపూర్(Kareena Kapoor) నటించాల్సి ఉండగా, డేట్స్ కుదరక ఆమె తప్పుకుంది. ప్రశాంత్ వర్మ(Prasanth Varma) డైరెక్షన్ లో రణ్‌వీర్ సింగ్(Ranvir Singh) చేయాల్సిన రాక్షస్(Rakshas) సినిమా సెట్స్ పైకి వెళ్లడమే లేట్ అనుకునే టైమ్ కు ఇద్దరికీ మధ్య మనస్పర్థలు రావడంతో ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ఇప్పుడదే సినిమాను ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో చేయాలని చూస్తున్నాడట. ఏదేమైనా ఈ ట్రెండ్ వల్ల అటు ఫ్యాన్స్, ఇటు ఫిల్మ్ మేకర్స్ మాత్రం తీవ్రంగా నిరాశ పడుతున్నారు.