Bollywood: బాలీవుడ్ స్టార్ల బిజినెస్‌లు

చిత్ర పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీల సంపాదన ఎంత ఎక్కువ మొత్తంలో ఉంటుందో స్పెషల్ గా చెప్పే పన్లేదు. బాలీవుడ్ లో అయితే ఆ సంపాదన ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో కూడా రెండు చేతులా కోట్లలో సంపాదిస్తున్నారు. అక్కడితో ఆగకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు వ్యాపారంలోకి కూడా దిగి సక్సెస్ అవుతున్నారు.
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలందరికీ ఎన్నో రకాల సైడ్ బిజినెస్‌లుండగా వారిలో సల్మాన్ ఖాన్(Salman Khan), కృతి సనన్(Krithi Sanon), దీపికా పదుకొణె(Deepika Padukone), అలియా భట్(Alia Bhatt), ప్రియాంక చోప్రా(Priyanka Chopra), కత్రినా కైఫ్(Katrina Kaif), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), హృతిక్ రోషన్(Hrithik Roshan) లు ఈ బిజినెస్ లో కూడా అగ్రస్థానంలో నిలుస్తున్నారు. దీపికాకు 82°E అనే స్కిన్ కేర్ బ్రాండ్ ను మొదలుపెట్టి మంచి డిమాండ్ ను ఏర్పరచుకోగా, సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్(Being Human) అనే క్లాథింగ్ బ్రాండ్ ను స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు.
కృతి సనన్ కు హైఫైన్(kefine) అనే బ్యూటీ కేర్ బ్రాండ్ ఉండగా, కత్రినా కైఫ్ నైకాతో కలిసి కే బ్యూటీ(Kay Beauty) అనే బ్యూటీ బ్రాండ్ ను మొదలుపెట్టింది. ప్రియాంక చోప్రా అనామలి(anomaly) అనే హెయిర్ కేర్ బ్రాండ్ ను స్టార్ట్ చేస్తే, అలియా భట్ ఎడ్ ఎ ముమ్మా(ed a mamma) అనే బ్రాండ్ తో మదర్ అండ్ చైల్డ్ క్లోథింగ్ బ్రాండ్ ను మొదలుపెట్టింది. రణ్‌బీర్ కపూర్ కు ఆర్క్స్(ARKS) అనే స్నీకర్ బ్రాండ్ ను ఏర్పాటు చేసి సక్సెస్ అవగా, హృతిక్ రోషన్ HRX పేరుతో ఓ క్లోథింగ్ బ్రాండ్ ను మొదలుపెట్టి మంచి ఆదాయాన్ని రాబట్టుకుంటున్నాడు.