షూటింగ్ క్లైమాక్స్ లో ఈ ట్విస్ట్ ఏంటి దేవరా?
ఈ ఇయర్ రానున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న దేవర ఒకటి. వాస్తవానికైతే ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ లేటవడంతో అక్టోబర్ 10కి వాయిదా వేశారు. అయితే సినిమా దానికంటే ముందే రెడీ అవనుండటం, దసరాకు కాంపిటిషన్ కూడా ఎక్కువ ఉండటంతో దేవరను సెప్టెంబర్ 27కి ప్రీ పోన్ చేశారు. దేవర రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. చిన్న చిన్న సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. ఇలాంటి టైమ్ లో ఈ సినిమా క్యాస్టింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. దేవరలో బాబీ డియోల్ ఓ విలన్ గా నటిస్తున్నాడట.
ఇప్పటికే సైఫ్ అలీఖాన్ దేవరలో మెయిన్ విలన్ అని అనౌన్స్ చేశారు. మరి మళ్లీ బాబీ డియోల్ ఎవరు అనే డౌట్ రావొచ్చు. అయితే రెండు భాగాలుగా రానున్న దేవరలో సైఫ్ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ కే ముగుస్తుందట. ఆ తర్వాత బాబీ డియోల్ రూపంలో కొత్త విలన్ ఎంట్రీ ఇస్తాడని, దీంతో సెకండ్ పార్ట్ లో బాబీ డియోల్ క్యారెక్టర్ కీలకమయ్యే ఛాన్సున్నట్లు చెప్తున్నారు. బాబీ డియోల్ దేవరలో నటిస్తే సినిమాకు ఆయనొక ఎట్రాక్షన్ అవడం ఖాయం.













