Biker Glimpse: ‘బైకర్’ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ అక్టోబర్ 31 నుంచి థియేటర్లలో స్క్రీనింగ్
చార్మింగ్ స్టార్ శర్వా తన అప్ కమింగ్ మూవీ ‘బైకర్’ (Biker) లో మోటార్‌సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రం పూర్తయ్యే దశకు చేరుకుంది. ఫస్ట్ లుక్, టైటిల్ తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ రేపటి నుంచే థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించబడనుంది. ఇదే రోజు విడుదల అవుతున్న బాహుబలి: ది ఎపిక్, మాస్ జాతర సినిమాలకు అటాచ్గా ఈ గ్లింప్స్ చూపించబోతున్నారు. ప్రేక్షకులకు ఇది డిజిటల్ విడుదలకు ముందే ఒక థియేట్రికల్ ట్రీట్‌గా నిలుస్తుంది. గ్లింప్స్ డిజిటల్‌గా నవంబర్ 1న సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ దుస్తుల్లో శర్వా కనిపించడం స్టైలిష్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంది. అతని పొడవాటి కర్లీ హెయిర్, సన్‌గ్లాసెస్ రెబెల్లియస్ టచ్ ఇచ్చాయి.
ఇటీవల వైరల్ అయిన షర్ట్‌లెస్ ఫోటోలతో శర్వా చేసిన అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
1990, 2000 బ్యాక్ డ్రాప్ లో సాగే “బైకర్” రేసింగ్ యాక్షన్ తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా. స్పీడ్, అంబిషన్, హార్ట్‌ఫెల్ట్ రిలేషన్షిప్స్ తో మూడు జనరేషన్స్ ఒకే రేసింగ్ కలతో, కుటుంబ బంధాలతో సాగే అద్భుతమైన కథ.
ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ జె. యువరాజ్, మ్యూజిక్ జిబ్రాన్, అనిల్ కుమార్ పి ఎడిటర్. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.







