Bartha Mahasayulaku Vignapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ హ్యూమరస్ టైటిల్ గ్లింప్స్
మాస్ మహారాజా రవితేజ,(Ravi Teja) కిషోర్ తిరుమల (Kishore Tirumala)దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ #RT76తో అలరించబోతున్నారు . SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri)ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈరోజు, మేకర్స్ హ్యుమరస్ గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్‌ను రిలీజ్ చేశారు.
దర్శకుడు కిషోర్ తిరుమల వాయిస్ ఓవర్లో వివరించిన టెంపుల్ అనౌన్స్మెంట్ తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఈ అనౌన్స్మెంట్ గురించి రవితేజ క్యారెక్టర్ మాట్లాడుతూ.. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్ ఏఐ అన్నిటిని అడిగాను. మేబి వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్ళని ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్య పోయారే తప్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు ఆడకూడదని, పెళ్లయిన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ.. మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి” అంటూ తనను రామ సత్యనారాయణగా పరిచయం చేసుకోవడం, భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ రివిల్ కావడం అదిరిపోయింది.
రవితేజ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్‌గా ఉంది. తన అద్భుతమైన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తన వెర్సటిలిటీని ప్రజెంట్ చేశారు. దర్శకుడు కిషోర్ తిరుమల టచ్‌తో టైటిల్ ఫ్యామిలీ ఫీలింగ్ కలిగించింది. గ్లింప్స్ చూస్తే సినిమా పక్కా ఎంటర్టైనింగ్గా, మనసుని హత్తుకునేలా ఉండబోతోందని అనిపిస్తోంది.
టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ ప్రసాద్ మురెళ్ల, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్. విజువల్స్ క్లాసీగా, గ్రాండుగా కనిపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా లైట్‌హార్ట్‌డ్ టోన్‌కి చక్కగా సరిపోయి, ఫన్ క్వోటెంట్ను మరింత పెంచుతోంది.
ప్రస్తుతం రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి పై ఒక ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌పై చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
టైటిల్ గ్లింప్స్ ద్వారా, భర్త మహాశయులకు విజ్ఞప్తి’ 2026 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి సంక్రాంతి పర్ఫెక్ట్ సీజన్.







