‘భానుమతి రెడ్డి’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ఎంపీ భరత్ రామ్
బాలు, అప్పర హీరో, హీరోయిన్ లుగా సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం భానుమతి రెడ్డి. డైమండ్ హౌస్ బ్యానర్‌పై రామ్‌ప్రసాద్ రెడ్డి వట్రవు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు ఎం.భరత్ రామ్ విడుదల చేసి, నిర్మాత రామ్ ప్రసాద్ రెడ్డికి సినిమా అన్ని రకాలుగా పెద్ద సక్సెస్ కావాలని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్య మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న లవ్‌స్టోరి. ప్రేమకథలో ఉండాల్సిన సెన్సిబుల్ అంశాలతో పాటు రా ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను మెప్పించేలా రూపొందిస్తున్నాం.
సినిమా విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సినిమా బాగా వస్తోంది. షూటింగ్ లాస్ట్ స్జేజ్‌లో ఉంది అని నిర్మాత రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. భరత్ రామ్ మా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి, అభినందించడం మాకు ఓ బూస్టప్ ఇచ్చింది. దర్శకుడు సత్య విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వైవిధ్యమైన ప్రేమకథ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్ట్‌తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. త్వరలోనే సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను తెలియజేస్తాం అని నిర్మాత రామ్ ప్రసాద్ వట్రపు తెలిపారు.













