Bhagyasri Borse: ఒకే నెలలో భాగ్య శ్రీ నుంచి రెండు సినిమాలు
రవితేజ(raviteja) హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్(Mr. Bachan) మూవీతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) ఆ సినిమాతో డిజాస్టర్ ను అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ(Vijay devarakonda)తో చేసిన కింగ్డమ్(Kingdom) సినిమా కూడా అమ్మడికి ఫ్లాపునే అందించింది. మొదటి రెండు సినిమాలూ ఫ్లాపైనప్పటికీ భాగ్యశ్రీకి టాలీవుడ్ లో ఛాన్సులకేమీ కొరవ లేదు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న భాగ్యశ్రీ నవంబర్ నెలలో రెండు పరీక్షలను ఎదుర్కోబోతుంది. ఈ నెలలో అమ్మడి నుంచి రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తో కలిసి చేసిన కాంత(Kantha) కాగా, రెండోది ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) సరసన చేసిన ఆంధ్రా కింగ్ తాలూకా(andhra king thaluka). కాంత సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుండగా, ఆంధ్రా కింగ్ తాలూకా నెలఖారుకి రిలీజ్ కానుంది.
కాంతలో హీరోయిన్ పాత్రలో కనిపించనున్న భాగ్య శ్రీకు ఆ సినిమాలో తన పాత్రతో ఆడియన్స్ ను మెప్పించే అవకాశాలు చాలానే ఉన్నాయి. పైగా దుల్కర్ కు తెలుగు, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా హిట్టైతే భాగ్యశ్రీ కెరీర్లో ఇదే మొదటి సక్సెస్ గా నిలుస్తుంది. ఆంధ్రా కింగ్ తాలూకా కూడా హిట్ గా నిలిస్తే అమ్మడి కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం ఖాయం. మరి భాగ్యశ్రీకి నవంబర్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.







