పాన్ సౌత్‌పై కన్నేసిన భాగ్యశ్రీ బోర్సే!
భాగ్యశ్రీ బోర్సే(bhagyasri borse) కెరీర్లో ఇప్పుడు మరో కీలకమైన మలుపు కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు తన గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో దగ్గరైన ఈ బ్యూటీ.. వరుసగా విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తన పరిధిని పెంచుకుంటోంది. మిస్టర్ బచ్చన్(mr. bachan) లో గ్లామరస్ రోల్‌తో ఆకట్టుకున్న ఆమె.. కాంతా(kaantha), ఆంధ్ర కింగ్ తాలూకా(Andra king thaluka), లెనిన్ (lenin)వంటి సినిమాలతో నటిగా మరో యాంగిల్ ను చూపించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో తన పెర్ఫార్మెన్స్తోనూ గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పటివరకు టాలీవుడ్‌కే పరిమితమైన భాగ్యశ్రీ బోర్సే కెరీర్ ఇప్పుడు ఇతర సౌత్ భాషల వైపు కూడా విస్తరిస్తోంది. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి కూడా అవకాశాలు అందుకుంటున్న ఈమె.. కథ, పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త ఛాలెంజ్‌లను స్వీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో సౌత్‌లో ఒకేసారి పలు ఇండస్ట్రీల్లో తన మార్క్ చూపించే హీరోయిన్గా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్(mohan lal) నటిస్తున్న ఆపరేషన్ గంగా(operation ganga) అనే సినిమా భాగ్యశ్రీ కెరీర్లో స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఇందులో ఆమె ఇండియన్ ఏజెంట్ పాత్రలో కనిపించనుండగా.. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ క్యారెక్టర్ ఆమెకు పూర్తిగా కొత్త ఇమేజ్ను తీసుకురానుంది. ఇప్పటికే భిన్నమైన పాత్రలతో తన కెరీర్‌ను డిజైన్ చేసుకుంటున్న భాగ్యశ్రీ.. ఆపరేషన్ గంగా తో పాన్ సౌత్ స్థాయిలో మరింత గుర్తింపు అందుకునే అవకాశం కనిపిస్తోంది.








