బాలయ్యను ఎదుర్కొనే సత్తా ఉందా?
టాలీవుడ్ లో దసరా కోసం సినిమాలు ఎప్పుడో కర్ఛీఫ్ వేసుకున్నాయి. ఇప్పటికే విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న లియో సినిమా అక్టోబర్ 19కి రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20కి షెడ్యూల్ అయింది. వీటితో పాటూ ముందే దసరా రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సినిమా భగవంత్ కేసరి.
రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేయలేదు కానీ రిలీజ్ మాత్రం పక్కా దసరాకే అని సినిమా మొదలైనప్పటి నుంచి మేకర్స్ చెప్తూనే వచ్చారు. కాకపోతే 20కి అనుకున్నారు ఒకరోజు ముందుకు జరిగి అక్టోబర్ 19న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అదే రోజు లియో సినిమా రిలీజ్ కానుంది. విజయ్ కు ఎంత ఇమేజ్ ఉన్నా అది టాలీవుడ్ లో మాత్రం పరిమితంగానే ఉంది.
తుపాకీ నుంచి విజయ్ మార్కెట్ పెరుగుతూపోతున్న విషయం నిజమే కానీ ఏకంగా బాలయ్యని ఎదుర్కొనేంత అంటే అనుమానమనే చెప్పాలి. బీ, సీ సెంటర్లలో మంచి పట్టున్న బాలయ్యతో విజయ్ పోటీ పడటం కమర్షియల్ విషయంలో కష్టమే. దానికి తోడు అసలు ఫ్లాపే ఎరుగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాకంటే సిట్యుయేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే భగవంత్ కేసరిపై మంచి అంచనాలున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా హైప్ ఇంకాస్త పెరుగుతుంది. కానీ లియో విషయంలో హైప్ ఇచ్చే విషయం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మాత్రమే. ఎన్ని ఉన్నా సరే సినిమాను సరిగా ప్రమోట్ చేస్తేనే జనాలకు చేరేది. అలాంటిది విజయ్ అసలు ప్రమోషన్లకే రాడు. ఇన్ని పరిస్థితుల మధ్య బాలయ్య, రవితేజ సినిమాలను ఎదుర్కొని విజయ్ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.













