Telangana: ఈసారి ఏపీ ఆడియన్స్దే లక్కు
తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాక బెనిఫిట్ షోలకు చాలా సులువుగా అనుమతులు వస్తున్నాయి. రెండు చోట్లా అర్థరాత్రి నుంచే షోలు పడిపోతున్నాయి. పుష్ప2(Pushpa2) సినిమాకైతే ముందురోజు రాత్రి నుంచే షోలు మొదలయ్యాయి. కానీ దాని వల్ల జరిగిన విషాదం వల్ల తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు ఉండవని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది.
మరి కొద్ది రోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలవుతున్న నేపథ్యంలో వాటికి టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ట్రా షోలకు పర్మిషన్లు తెచ్చుకోవాలని ఆయా చిత్ర నిర్మాతలు ట్రై చేస్తున్న నేపథ్యంలో ఏపీలో మాత్రం ఈజీగా పర్మిషన్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పటికే గేమ్ ఛేంజర్(Game Changer), డాకు మహారాజ్(Daku Maharaj) సినిమాలకు పర్మిషన్స్ వచ్చాయి.
అంతేకాదు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు అక్కడ అర్థరాత్రి ఒంటి గంట షోలు కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. కానీ తెలంగాణలో ఏం జరగబోతుందనేది ఇంకా తెలియడం లేదు. మూడు సినిమాల్లో రెండు దిల్ రాజు(Dil Raju) నిర్మించిన సినిమాలు కావడం, మూడో సినిమాకు కూడా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజే కావడం వల్ల పర్మిషన్స్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. బెనిఫిట్ షోలు లేకపోయినా అదనపు రేట్లు వస్తే చాలని దిల్ రాజు చూస్తున్నాడు. గత ప్రభుత్వ కాలంలో మిడ్నైట్, ఎర్లీమార్నింగ్ షోలు లేక ఏపీ ఆడియన్స్ ఇబ్బంది పడితే ఇప్పుడు తెలంగాణ ఆడియన్స్ ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ టికెట్ రేట్ల పెంపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.













