చిరూ ఫ్యాన్స్ ఇక రిలాక్స్ అవొచ్చు
గత రెండు రోజులుగా మెగాస్టార్ చిరంజీవి ఓ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్తలు నెట్టింట బాగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చేస్తూ బిజీగా ఉన్న చిరంజీవి, సడెన్ గా ఈ నిర్ణయం తీసుకున్నాడా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మంచి సబ్జెక్ట్ దొరికితే వెబ్ సిరీస్ చేయాలని ఆయన మనసులో ఉన్న విషయం అందరికీ తెలుసు.
కానీ ఇప్పటివరకు మాత్రం చిరూ వెబ్ సిరీస్ల విషయంలో ఎవరికీ ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. కథను విని గుడ్డిగా ఒప్పుకుని తర్వాత రిజల్ట్ చూసి బాధ పడకంటే ముందే జాగ్రత్తగా ఉండటం బెటరని డిసైడయ్యాడట చిరూ. వాస్తవానికి ఆహా స్టార్టింగ్ లోనే చిరూతో ఓ సిరీస్ చేయాలని అల్లు అరవింద్ అనుకున్నప్పటికీ దానికి తగ్గ స్టోరీ, డైరెక్టర్ లేకపోవడంతో అది వర్కవుట్ అవలేదు.
తర్వాత నెట్ఫ్లిక్స్ కొన్ని ప్రణాళికలు రెడీ చేసి చరణ్ ద్వారా పంపగా, ఆ బోల్డ్నెస్ ను ముందే గ్రహించిన చిరూ దాన్ని పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. దీని బట్టి చూస్తుంటే ప్రస్తుతం చిరూ చేతిలో విశ్వంభర మాత్రమే ఉంది. ఆ తర్వాత చిరూతో సినిమాలు చేయడానికి హరీష్ శంకర్, అనిల్ రావిపూడి రెడీగా ఉన్నారు. ఈ గ్యాప్ లో వెబ్ సిరీస్ లు చేసే తీరిక చిరూకు లేదు కాబట్టి ఫ్యాన్స్ ఈ విషయంలో కంగారు పడే పన్లేదు.













