Akhanda2: నందమూరి బాలకృష్ణ, #BB4 అఖండ 2: తాండవం బ్లాస్టింగ్ రోర్ రిలీజ్
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ద్వారా లెజెండ్ అఖండ పాత్రను పరిచయం చేసిన ఫస్ట్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ మరో పాత్రను పరిచయం చేయడానికి మేకర్స్ అఖండ 2: బ్లాస్టింగ్ రోర్ టైటిల్ తో మరో ఎలక్ట్రిఫైయింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో బాలకృష్ణ పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ తో అదరగొట్టారు.
బోయపాటి శ్రీను తన సిగ్నేచర్ స్టైల్‌లో బాలయ్య ని లార్జర్ దెన్ లైఫ్ మూమెంట్స్ తో అద్భుతంగా ప్రజెంట్ చేశారు.
బాలయ్య గర్జన సింహంలా వినిపించగా, ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ బ్లాక్స్ అదిరిపోయాయి. చివర్లో ఆయన కాలు మోపగానే గుర్రాలు భయంతో దూకడం పక్కా మాస్ ఎలివేషన్.
”సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు. ఊహకి కూడా అందదు’ అని బాలకృష్ణ చెప్పిన డైలాగు గూజ్ బంప్స్ తెప్పించింది.
రామ్-లక్ష్మణ్ మాస్టర్‌ల యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉండగా, ఎస్. థమన్ అందించిన బిజిఎమ్ పవర్‌ఫుల్‌గా ఉంది. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నత స్థాయిలో వున్నాయి. ఈ కొత్త టీజర్‌తో, అఖండ 2: తాండవం కోసం అంచనాలు మరింత పెరిగాయి.
ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
పవర్ ఫుల్ టీం, భారీ అంచనాలతో రూపొందుతున్న ‘అఖండ 2: తాండవం’ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజాగా గా అలరించబోతోంది.
అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.







