కర్ణాటక అడవుల్లో బీబీ3 టీమ్
బాలయ్య, బోయపాటి కాంబో అంటే మంచి పవర్ ఫుల్ కాంబినేషన్స్ లో ఒకటి. వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చి దాదాపు ఏడేళ్లయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే అందరి ఆసక్తి ఈ సినిమాపైనే ఉంది. ముచ్చటగా మూడోసారి బాక్సాఫీస్ ను షేర్ చేసేందుకు మే 28న వీరి కాంబినేషన్ లోని సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
గతేడాది బాలయ్య బర్త్ డే సందర్భంగా స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశాడు బోయపాటి. ఆ ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది బాలయ్య ఈ సినిమాలో ఎంత పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడో తెలుస్తూనే ఉంది. బోయపాటి కోసం సినిమా బాలయ్య ఎలాంటి రిస్క్ అయినా చేస్తాడు. అంతేకాదు బోయపాటి బాలయ్య సినిమా అంటే హీరో డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడనే టాక్ కూడా ఉంది. ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు గెటప్స్ లో కనిపించనున్నాడు.
వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ లు మంచి విజయం సాధించడంతో ఈ బిబి3 సినిమాపై భారీ అంచనాలున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో చిత్ర యూనిట్ షూటింగ్ ను మరింత వేగం చేసింది. దీని కోసం కర్ణాటకలోని దండేలి అడవిలో ఒక కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు. బాలయ్యతో పాటు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, మిగిలిన నటీనటులు కూడా అక్కడికి చేరుకున్నారు. తొమ్మిది రోజుల పాటూ జరగనున్న ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారటి సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూర్ణ విలన్ గా కనిపించనుంది. ఈ సినిమాను మిర్యాల రవీందర్ నిర్మిస్తున్నారు.













