మోదీ భార్యగా బర్ఖా బిస్త్ సేన్ గుప్తా
ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం పిఎం నరేంద్రమోదీ. వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు భార్యగా, యశోదాబెన్ మోదీ పాత్రలో బర్ఖా బిస్త్ సేన్‌గుప్తా నటిస్తున్నారు. ఈ విషయాన్ని ధృవీకరించారామె. ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. యశోదాబెన్ గురించి ప్రజలకు తెలిసింది తక్కువే. అందువల్ల ఈ పాత్రలో నటించడం ఛాలెంజింగ్‌గా ఉంది అని బర్ఖా సేన్‌గుప్తా తెలిపారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో సందీప్ సింగ్, వివేక్ ఒబెరాయ్ తండ్రి సురేశ్ ఒబెరాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రం 23 భాషల్లో విడుదల కానుంది.













