బాలయ్య స్పీడును తట్టుకోవడం కష్టమే..
కరోనా తో ఏ స్టార్ హీరో సినిమాలూ రిలీజ్ అయింది లేదు. ఏడాది మొదట్లో ఒకట్రెండు పెద్ద సినిమాలొచ్చినా సరే ఫుల్ రేంజ్ బిగ్ మూవీస్ వచ్చి సంవత్సరం దాటింది. ఒక సంవత్సరం గ్యాప్ వచ్చినందున అందరు హీరోలూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కరోనా తర్వాత రావాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ఒకటి తర్వాత మరొకటి అన్నట్లు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు.
కరోనా తగ్గాక సిట్యుయేషన్స్ అన్నీ నార్మల్ అయితే తన సినిమాలను వరుసగా రిలీజ్ చేయాలనుకుంటున్న హీరోల్లో బాలయ్య కూడా చేరిపోయారు. ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్న బాలయ్య, కరోనా లేకపోయుంటే గతేడాదే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవాడు. కానీ ఆ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ అవలేదు. వచ్చే నెలలో రిలీజ్ చేద్దామనుకుంటే సెకండ్ వేవ్ వల్ల మళ్లీ పోస్ట్ పోన్ అయ్యే సిట్యుయేషన్ వచ్చింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఎప్పటికి అఖండ రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి.
బాలయ్య లాస్ట్ సినిమా రిలీజ్ అయ్యి చాలా టైమ్ అయింది. కరోనా వల్ల బాలయ్యకు చాలా గ్యాప్ వచ్చింది. దీంతో ఈ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు అఖండ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను ప్లాన్ చేశాడని, ఏకకాలంలో రెండు సినిమాలకు బాలయ్య కమిట్ అయ్యాడని వార్తలొస్తున్నాయి. వాటిలో ఆల్రెడీ గోపీచంద్ మలినేని డైరక్షన్ లో షూటింగ్ ఎప్పుడైనా మొదలయ్యే ఛాన్సుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరక్షన్ లో ఒక సినిమాకు బాలయ్య కమిట్ అయ్యాడు. అది కూడా వెంటనే పట్టాలెక్కే ఛాన్సుందంటున్నారు. ఈ రెండు సినిమాలూ కూడా ఒకేసారి మొదలుపెట్టి, రెండు నెలల గ్యాప్ తో రిలీజ్ చేసేలా బాలయ్య ప్లాన్ చేశాడని తెలుస్తుంది.













