తమన్ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
ఏదైనా సినిమాకు తమన్ పని చేస్తున్నాడంటే, పాటల కంటే ఎక్కువగా అందరి ఫోకస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పైనే ఉంటుంది. అఖండ సినిమాతో స్పీకర్లు పగిలే బీజీఎం ఇచ్చిన తమన్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి ఆల్బమ్ చార్ట్ బస్టర్ కాకపోయినా మంచి పాటలు ఇవ్వడానికి తమన్ చాలానే కష్టపడుతున్నాడు.
తమన్ నుంచి వస్తున్న తాజా సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా నుంచి రిలీజైన పాటలకు తమన్ మంచి సంగీతమే అందించినా అవి రెండూ సెంటిమెంటల్ సాంగ్స్ కావడంతో మాస్ ఫ్యాన్స్ కు కావాల్సిన సంగీతం రాలేదని ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఆ లెక్కను సరిచేస్తూ తమన్ రోర్ ఆఫ్ భగవంత్ కేసరి సాంగ్కు ప్రాణం పోశాడు.
ఈ సాంగ్ కోసం తమన్ రెండు రోజుల పాటూ రికార్డింగ్ స్టూడియోలోనే ఉన్నాడట. ఈ సాంగ్ కు ఇచ్చిన మ్యూజిక్ కు బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు తమన్ అదిరిపోయే సంగీతం అందించాడు. కాకపోతే ఈ సాంగ్ ముందుగానే రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.













