తిత్లీ బాధితులకు బాలకృష్ణ ఫ్యాన్స్ విరాళం
తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులు ముందుకు వచ్చారు. అభిమానుల తరుపున రూ.1,71,346 విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉండవల్లిలో కలిసిన మన బాలయ్య డాట్ కామ్ నిర్వాహకుడు పుల్లెల గౌతమ్ రూ.1,71,346 చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. పెనుతుపాను తాకిడికి సర్వస్వాన్ని కోల్పోయిన ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన బాలయ్య అభిమానులను చంద్రబాబు అభినందించారు. ఇదే స్ఫూర్తి సమాజంలోని అన్ని వర్గాల్లో కనిపించాలని, బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.













