మరోసారి సెట్స్‌పైకి బాలయ్య-బోయపాటి
నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, యాంకరింగ్ అంటూ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆయన కెరీర్లో పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్లలో బి గోపాల్ తర్వాత బోయపాటి శ్రీను ఉంటాడు. సింహాతో మొదలైన వీరి కాంబినేషన్ లెజెండ్‌తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. వరుస డిజాస్టర్లతో ఉన్న బాలయ్యకు అఖండ రూపంలో ఎవరూ ఊహించని విజయాన్ని అందించాడు. అందుకే వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే బాలయ్య ఫ్యాన్స్ కే కాదు సగటు సినీ అభిమానులకు కూడా ఎక్కడ లేని ఊపు, ఉత్సాహం వస్తాయి. వీరిద్దరూ ప్రస్తుతం వేరు వేరు కమిట్మెంట్లతో ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం రామ్ తో సినిమా చేస్తున్న బోయపాటి, ఆ సినిమా పూర్తవగానే అఖండ-2కి స్క్రిప్ట్‌ని రెడీ చేసి దాన్ని ఓ కొలిక్కి తీసుకొస్తాడని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అఖండ సీక్వెల్ కు బదులుగా మరో పవర్ఫుల్ సబ్జెక్టుతో బోయపాటి రీసెంట్గా బాలయ్యకు ఓ లైన్ వినిపించాడని, బాలయ్యకు ఆ లైన్ నచ్చడంతో బోయపాటి ఫుల్ స్టోరీ వండే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.
అంతా అనుకున్నది అనుకున్నట్లు అయితే జూన్ రెండో వారంలో బాలయ్య బర్త్ డే కు సినిమాను లాంఛ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. వరుస విజయాలతో పాటూ అన్‌స్టాపబుల్ షో బ్లాక్ బస్టర్ అవడం, వీరసింహారెడ్డితో తన కెరీర్ బెస్ట్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమాపై పాజిటివ్ వైబ్స్ వచ్చేశాయి. మొత్తానికి కుర్రాళ్లకు పోటీగా బాలయ్య మంచి లైనప్‌ను సెట్ చేసుకుంటున్నాడు.













