బాలయ్య, బోయపాటికి ముహూర్తం కుదిరిందా ?
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిసి పనిచేసే మూడవ సినిమాపై ఆసక్తి నెలకొంది. వీరిద్దరు కలిసి చేసిన సింహా, లెజెండ్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి కలుస్తున్నారు. ఇదే నెలాఖరున అంటే 28వ తేదీన లాంఛనంగా షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఎన్నికల తరువాత ఏప్రిల్ అనంతరం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలిసింది. బాలకృష్ణ సొంత నిర్మాణ సంస్థ ఎన్బికె ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు ఇటీవలే విడుదలయ్యాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా ఫలితం ఆశించిన విధంగా లేదు. కమర్షియల్గా నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం బాలకృష్ణకు, బోయపాటికి ఇద్దరికి మంచి సక్సెస్ కావాలి.













