అఘోరా గెటప్ ని కూడా మార్చేస్తున్న బాలయ్య
నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కతున్నవిషయం తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్న ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. చిన్నతనంలోనే విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు పెద్దయ్యాక ఒకరు పొలిటికల్ లీడర్ గా మారితే మరొకరు అఘోరాగా మారతారట.
వాస్తవానికి అఘోరా అంటే జడలు పెరిగిన జుట్టుతో శరీరమంతా బూడిద పూసుకుని ఉంటారు. అయితే అలాంటి గెటప్ లో బాలయ్యను చూడటానికి ఫ్యాన్స్ ఇష్టపడరమో అని ఆ క్యారెక్టర్ ను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట బోయపాటి. అఘోరాని తపించేలా లాల్చీ, పంచెకట్టులో బాలయ్యని పవర్ ఫుల్ గా చూపించనున్నారట. ఇప్పటికే రిలీజైన బీబీ3 టీజర్ లో బాలయ్య ఒక గెటప్ ని చూపించిన విషయం తెలిసిందే. రాబోయే షెడ్యూల్ లో బాలయ్య అఘోరా పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టనున్నారని టాక్.
సమ్మర్ కానుకగా మే 28న రిలీజ్ చేయనున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు. కానీ సినిమా షెడ్యూల్స్ ఇప్పటికే ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి కాబట్టి సినిమా టైమ్ కు వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ టీమ్ మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి బాలయ్య, బోయపాటి చెప్పిన టైమ్ కి పక్కా వస్తామని చెప్తుంది. థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో అఖిల్ బ్యూటీ సాయేషా సైగల్, కంచె ఫేమ్ ప్రగ్యా హీరోయిన్లు గా నటిస్తున్నారు. పూర్ణ కీలక పాత్రలో కనిపించనుంది. సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ల తర్వాత బాలయ్య, బోయపాటి ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా హ్యాట్రిక్ మూవీ గా నిలవనుందని ఎంతో ఆశగా ఉన్నారు.













