మరోసారి బాలయ్య వర్సెస్ చిరూ
బాలకృష్ణ, చిరంజీవికి మధ్య గతంలో బాక్సాఫీస్ వద్ద ఎన్నోసార్లు క్లాష్ జరిగింది. ఒకే సీజన్ లో పోటీ పడి, సినీ ఫ్యాన్స్ కు కావాల్సినంత ఎంటర్టైనర్మెంట్ అందించారు. అందులో కొన్నిసార్లు చిరు పై చేయి సాధిస్తే, మరికొన్ని సందర్భాల్లో బాలయ్య పై చేయి సాధించాడు. వీరిద్దరూ కలిసి ఇప్పుడు మరోసారి పోటీ పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాను చేస్తున్న బాలకృష్ణ ఆ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. మరోవైపు చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ అడ్వెంచర్ సినిమాను చేస్తు్నాడు.
ఈ రెండు సినిమాలూ రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయని టాక్. సినిమాలకు పెద్ద సీజన్ గా భావించే సంక్రాంతికి ఎప్పుడూ టాలీవుడ్ లో భారీ పోటీనే ఉంటుంది. ఇప్పటికే విశ్వంభరను జనవరి 10కి లాక్ చేశారు. బాలకృష్ణ సినిమాను ఈ ఏడాది దసరాకు అనుకున్నారు కానీ ఆ టైమ్ లో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని కూడా సంక్రాంతి రేసులో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే రెండుసార్లు సంక్రాంతికి పోటీ పడ్డ ఈ సీనియర్ హీరోలు ఇప్పుడు మరోసారి పోటీ పడనున్నారన్నమాట.













