Aditya999: ఆదిత్య 999 కోసం బాలయ్య నెక్ట్స్ లెవెల్ ప్లాన్
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) 100 కి పైగా సినిమాలు చేసినప్పటికీ వాటిలో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అంటే అందరూ ముందుగా చెప్పేది ఆదిత్య 369(Aditya 369) గురించే. సింగీతం శ్రీనివాసరావు(Singeetham Srinivasarao) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తన ఫేవరెట్ సినిమాల్లో ఒకటిగా బాలయ్య(Balayya) ఎప్పుడూ ప్రత్యేకంగా చెప్తుంటాడు.
ఈ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999(Aditya 999) వస్తుందని, బాలకృష్ణే ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తారని వార్తలొచ్చాయి. అయితే బాలయ్య ఆ సినిమాకు కథ మొదలుపెట్టింది నిజమే కానీ వరుస సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల బాలయ్య ఆ కథను పూర్తి చేయలేదని టాక్. ఆదిత్య 999 ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి భారీ అనౌన్స్మెంట్తో సినిమాను మొదలుపెట్టాలనేది బాలయ్య ప్లాన్.
అయితే ఈ మూవీ విషయంలో బాలయ్య చాలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆదిత్య 999ని మల్టీస్టారర్ గా తీర్చిదిద్దాలని చూస్తున్నాడట బాలయ్య. ఇప్పటికే ఆదిత్య 999లో మోక్షజ్ఞ(Mokshagna) నటిస్తాడని ఎంతో బలంగా చెప్తుండగా, ఇప్పుడదే సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్సేన్(Viswaksen), సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) కూడా నటిస్తారంటున్నారు. బాలయ్య అంటే ఈ ఇద్దరి హీరోలకు ఎంతో అభిమానం. ఈ వార్త నిజమైతే మాత్రం ఆదిత్య 999 రేంజ్ మొదటి నుంచే నెక్ట్స్ లెవెల్ లో ఉండటం ఖాయం.













