రష్మిక నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
యానిమల్(Animal) సినిమా తర్వాత రష్మిక మందన్నా(Rashmika Mandanna) మళ్లీ మరో సినిమాలో కనిపించింది లేదు. అలా అని అమ్మడు గ్యాప్ ఏం తీసుకోలేదు. షూటింగ్ లేటవడం వల్ల రిలీజ్ లేటయింది కానీ తాను ఖాళీగా లేదు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ఆకలిని ఒకేసారి తీర్చాలనే పట్టుదలతో రష్మిక 10 నెలల గ్యాప్ లో ఏకంగా ఆరు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
వాటిలో మొదటి మూవీ పుష్ప2(Pushpa2) అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో సుకుమార్(Sukumar) తన పాత్రను మొదటి భాగంలో కంటే ఎక్కువగా తీర్చిదిద్దినట్టు సమాచారం. దాని తర్వాత నెల లోపే బాలీవుడ్ మూవీ చావా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్(Vicki Kaushal) సరసన రష్మిక చాలా పవర్ఫుల్ పాత్రను చేసినట్లు సమాచారం.
ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వంలో రూపొందుతున్న ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇంకా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయలేదు కానీ సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మురుగదాస్(Murugadoss) దర్శకత్వంలో సల్మాన్ ఖాన్(Salman Khan) కు జోడీగా నటించిన సికిందర్(Sikindar) ఈద్ కు రిలీజ్ కానుంది. నాగార్జున(Nagarjuna)- ధనుష్(Dhanush) కాంబినేషన్ లో వస్తున్న కుబేర(Kubera) సినిమా వచ్చే వారం రిలీజ్ కానున్న టీజర్ లో రిలీజ్ డేట్ ను చెప్పనున్నారు. ఇవి కాకుండా హారర్ మూవీ తమా(thama)లో కూడా రష్మిక నటిస్తోంది. ఎంత లేదన్నా ఈ సినిమాలన్నీ 2025 అక్టోబర్ లోపు రిలీజ్ అవుతాయి. మరో సినిమా రెయిన్ బో(Rain Bow) ఎప్పుడు రిలీజ్ కానుందనేది తెలియాల్సి ఉంది. మరి వీటిలో రష్మిక ఎన్ని సినిమాలతో హిట్లు అందుకుంటుందో చూడాలి.













