లాభాలతో థియేటర్లలోకి రానున్న బచ్చలమల్లి
రీసెంట్ గా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లరి నరేష్ ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఇప్పుడు అల్లరి నరేష్ తాజాగా సీరియస్ రోల్ లో బచ్చలమల్లి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. నిజ జీవిత సంఘటనల స్పూర్తితో డైరెక్టర్ సుబ్బు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
హాస్య మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న బచ్చలమల్లి లిమిటెడ్ బడ్జెట్ తోనే తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లకి బచ్చలమల్లి థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్ లో రూ. కోటికి డీల్ ముగిసినట్లు సమాచారం. అంటే బచ్చలమల్లికి థియేట్రికల్ బిజినెస్ రూ.6 కోట్లకి పైగా జరిగినట్లు లెక్క. ఇవి కాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ లెక్కలు వేరే ఉన్నాయి. అంటే నిర్మాతలు ఈ సినిమాను టేబుల్ ప్రాఫిట్ తోనే రిలీజ్ చేయనున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.6.50 కోట్ల షేర్ ను తెచ్చుకుంటే మంచి హిట్ అయినట్లు లెక్క. మరి బచ్చలమల్లి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













