పవన్ రాకపోయినా వరుణ్ వచ్చేస్తున్నాడు
తమిళ సూపర్ హిట్ సినిమా తేరిని తెలుగులో పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ గా హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొంత పార్ట్ షూటింగ్ అయ్యాక ఎన్నికల ప్రచారంలో బిజీ కావడం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ లేటయింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ రీమేక్ లో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు మొదలవుతుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే తేరీ హిందీ రీమేక్ బేబీ జాన్ మాత్రం డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కలీస్ దర్శకత్వం వహిస్తుండగా, అట్లీ నిర్మాణంలో రూపొందుతుంది.
తనకు టైమ్ దొరికినప్పుడల్లా పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్స్ ఇచ్చి ఉంటే హరీష్ శంకర్ ఈ సినిమాను ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యేలా షూటింగ్ పూర్తి చేసేవాడు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. బేబీ జాన్ వల్ల పవన్ సినిమాకు పెద్దగా వచ్చే నష్టం లేనప్పటికీ కథ పరంగా ఉన్న ఆసక్తి, ఎగ్జైట్మెంట్ తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఇదిలా ఉంటే పవన్ మాత్రం తన రాజకీయ పదవిని నిర్వర్తించడంలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి ప్లానింగ్ ప్రకారం అటు రాజకీయాలను, ఇటు సినిమాలను రెండూ బ్యాలెన్స్ అయ్యేలా చూసుకుని పవన్ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడని ఆయన సన్నిహితులంటున్నారు.













