Ravi Teja: భారీ క్లాష్ కు రవితేజ రెడీనా?

జయాజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకెళ్తుంటాడు మాస్ మహారాజా రవితేజ(Raviteja). ధమాకా(Dhamaka) సినిమా తర్వాత రవితేజ చాలా సినిమాలు చేసినప్పటికీ అవేవీ ఆయనకు సరైన సక్సెస్ ను ఇవ్వలేదు. ప్రస్తుతం భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో మాస్ జాతర(Mass jathara) సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ మూవీలో రవితేజకు జోడీగా శ్రీలీల(Sree Leela) నటిస్తోంది.
వాస్తవానికి మాస్ జాతర సినిమా ఆగస్ట్ 27న రిలీజ్ కావాల్సింది కానీ మొన్నటివరకు టాలీవుడ్ లో జరిగిన సమ్మె కారణంగా ఈ మూవీ షూటింగ్ లేటైంది. క్రమంగా సినిమా వాయిదా పడింది. ఆగస్ట్ నుంచి సినిమాను వాయిదా వేసినట్టు చెప్పిన మేకర్స్ సెప్టెంబర్ లో కొన్ని రిలీజ్ డేట్స్ ను అనుకున్నారు కానీ సెప్టెంబర్ లో కూడా సినిమా రావడం లేదని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, మాస్ జాతర సినిమాను మేకర్స్ అక్టోబర్ 31న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే రవితేజకు భారీ పోటీ తప్పదు. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి(Baahubali) రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్(Baahubali the epic) పేరుతో అదే రోజున రిలీజ్ చేస్తున్నారు బాహుబలి మేకర్స్. ఇప్పుడదే రోజున రవితేజ సినిమా అంటే భారీ క్లాష్ ఉంటుంది. పైగా ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రావు. మరి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మాస్ జాతర టీమ్ ఏమైనా ఆలోచిస్తుందా లేదా అదే రోజున తమ సినిమాను రిలీజ్ చేస్తారో చూడాలి.