కీరవాణికి మరో అరుదైన గౌరవం
బాహుబలి చిత్రాలతో దేశ, విదేశాల్లో స్టార్ డైరెక్టర్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. అదేవిధంగా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన ఎం.ఎం.కీరవాణికి కూడా మంచి పాపులారిటీ వచ్చింది. ఇక బాహుబలి టీమ్‌కు ఎన్నో గౌరవ సత్కారాలు దక్కాయి. ఇండియాలో ది బెస్ట్ అన దగ్గ ఐఐటీలలో రాజమౌళి గెస్ట్ లెక్చర్లు ఇచ్చారు. బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పారు. దేశ విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల నుంచి జక్కన్న పిలుపును అందుకున్నారు. ఇదంతా తెలుగువారి ప్రతిభకు దక్కిన గౌరవంగా భావించాలి. మరోసారి అలాంటి గౌరవమే దక్కనుంది. బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్స్ హాల్లో ప్రదర్శించనున్నారు. సౌత్ నుంచి ఈ అర్హత సాధించిన ఏకైక సినమా ఇది కావడం విశేషం. హాలీవుడ్ బ్లాక్బస్టర్లు, స్కై ఫాల్, హ్యారీపాటర్ చిత్రాలతో పాటు బాహుబలి 1 చిత్రం హిందీ వర్షన్‌ను ఈ ప్రతిష్టాత్మక హాల్లో ప్రదర్శించనున్నారు. ఇక్కడ ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సంబంధించిన లైవ్ కాన్సర్ట్‌ను కూడా నిర్వహిస్తారు. బాహుబలి రీరికార్డింగ్ వర్క్ గురించి కీరవాణి లైల్లో లెచ్చర్ ఇవ్వనున్నారు. అక్టోబరు 19న ఈ కార్యక్రమం ఉంటుంది.













