బ్రహ్మాస్త్ర సెకండ్ పార్ట్ లేనట్టేనా?
బాలీవుడ్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా రూపొందిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా తీయడానికి నిర్మాతలు పెట్టిన ఖర్చు రూ.400 కోట్లకు పైగానే. బిజినెస్ మాత్రం రూ.500 కోట్లకు పైగానే చేశాడు. గతేడాది రిలీజైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ సినిమా మాత్రం బయ్యర్లకు నష్టాన్నే మిగిల్చింది.
కానీ మేకర్స్ మాత్రం బ్రహ్మాస్త్ర బ్లాక్ బస్టర్ అన్నట్లు ప్రమోట్ చేసుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజైనప్పుడే ఇంకో రెండు పార్ట్లు రానున్నట్లు అనౌన్స్ చేశారు. సెకండ్ పార్ట్ కు సంబంధించిన హింట్‌ను కూడా సినిమాలో ఇచ్చారు కానీ బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల ప్రకారం ఈ సినిమా సెకండ్ పార్ట్ తీయడానికి నిర్మాత కరణ్ జోహార్ ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తోంది.
బ్రహ్మాస్త్ర విషయంలో ఒకసారి తలనొప్పి తెచ్చుకున్న ఆయన మరోసారి ఆ పని చేయాలనుకోవట్లేదట. సినిమా ఎంత హిట్ అని చెప్పుకున్నా సరే వాస్తవమేంటనేది ఆయనకు తెలుసు కాబట్టే ఈ నిర్ణయం తీసుకుని బ్రహ్మాస్త్ర2 ని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లి ఉండాల్సింది కానీ అది జరగలేదు. డైరెక్టర్ కూడా ఈ ప్రాజెక్ట్ ను వదిలేసి వేరే ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయడంతో బ్రహ్మాస్త్ర2 ఇక లేదని ఫిక్స్ అయిపోవచ్చు.













