Allu Arjun: లుక్ టెస్ట్ లో పాల్గొన్న బన్నీ
పుష్ప2(Pushpa2) మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్(allu arjun) తన తర్వాతి సినిమాను కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేసుకున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ(atlee) తో సినిమాను ఫిక్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన బన్నీ(bunny) ఇప్పుడు ఆ సినిమా పనుల్లో బిజీగా ఉంటూ రెగ్యులర్ గా ముంబై వెళ్తున్నాడు. రీసెంట్ గా కూడా బన్నీ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే.
అయితే బన్నీ ముంబై వెళ్లింది లుక్ టెస్ట్ కోసమని తెలుస్తోంది. ముంబై బాంద్రాలోని మెహబూబ్ స్టూడియోస్ లో ఆదివారం బన్నీపై లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫోటో షూట్ చేశాడట అట్లీ. ఆల్రెడీ పుష్ప లుక్ తో ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసిన బన్నీని అట్లీ తన సినిమాలో చాలా భిన్నంగా చూపించనున్నాడట. దానికోసం బన్నీపై పలు లుక్ టెస్ట్ లను ట్రై చేసినట్టు తెలుస్తోంది.
మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం వరకు ఈ లుక్ టెస్ట్ జరిగిందని, ఈ లుక్ టెస్ట్ లో బన్నీ ఎంతో ఆసక్తిగా పాల్గొన్నట్టు తెలుస్తోంది. సినిమాలోని ఓ కీలక సీన్ కోసం 12 ఏళ్ల పిల్లలను కూడా కాన్సెప్ట్ షూట్ చేసి సెలెక్ట్ చేశారని సమాచారం. అట్లీతో బన్నీ చేయబోయే సినిమా కథాంశం ఏంటనేది ఇంకా తెలియదు కానీ ఇదొక హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.






