Atlee: భారీ మల్టీస్టారర్‌ను ప్లాన్ చేస్తున్న అట్లీ
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) జవాన్(Jawaan) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకోవడమే కాకుండా ఆ సినిమాతో యావత్ దేశాన్ని మెప్పించాడు. షారుఖ్(Sharukh) హీరోగా రూపొందిన ఆ సినిమా భారీ హిట్ అయింది. ఈ నేపథ్యంలో అట్లీ తన తర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడని అందరూ అనుకున్నారు. మరోసారి షారుఖ్ తోనే అట్లీ జత కట్టనున్నాడని వార్తలు కూడా వచ్చాయి.
కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఎంతకీ ముందుకు కదలకపోవడంతో అట్లీ ఇప్పుడు ఓ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) కలిసి నటిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ మల్టీస్టారర్ నిజమైతే మాత్రం సినిమా అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ రావడం ఖాయం.
అయితే అట్లీ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన తర్వాతి సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన తర్వాతి సినిమాలోని స్టార్లను చూసి అంతా ఆశ్చర్యపోతారని, సినిమా అవుటాఫ్ ది వరల్డ్ ఐడియాతో రూపొందనుందని ఊరించాడు అట్లీ. దీంతో అప్పుడు అట్లీ చెప్పిన సినిమా ఇదేనని అందరూ చెప్పుకుంటున్నారు.













