Atlee: షాకిస్తానంటున్న అట్లీ
సౌత్ దర్శకుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసి పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను పెంచుకున్న దర్శకుల్లో అట్లీ(Atlee) ఒకడు. రాజా రాణి(Raja Rani), తేరి(theri), బిగిల్(bigil) లాంటి బ్లాక్ బస్టర్లతో సౌత్ లో తన సత్తా చాటుకున్న అట్లీ, షారుఖ్ ఖాన్(Shahrukh Khan) తో జవాన్(Jawaan) చేసి దేశ వ్యాప్తంగా తన ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. జవాన్ ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్లు రాబట్టి నేషనల్ లెవెల్ లో హిట్ గా నిలిచింది.
జవాన్ తర్వాత అట్లీ అల్లు అర్జున్(Allu Arjun), ఎన్టీఆర్(NTR) తో సినిమాలు చేస్తాడని ఎన్నో వార్తలొచ్చాయి కానీ అవేవీ నిజం కాలేదు. వారితో పాటూ షారుఖ్ తో కూడా అట్లీ మరో సినిమా చేస్తాడన్నారు కానీ దానికి ఇంకాస్త టైముందని తెలుస్తోంది. దీంతో అట్లీ తన తర్వాతి సినిమాను సౌత్ మూవీగా చేస్తాడా లేదా పాన్ ఇండియా స్టైల్ లోనే చేస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా అట్లీ తన కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తైందని, ఈ సినిమాకు పని చేసే నటీనటుల విషయంలో ఆడియన్స్ షాక్ కు గురవుతారని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ సినిమా కథ అవుట్ ఆఫ్ ది వర్ల్డ్ కథగా ఉంటుందని, ఎవరి ఊహలకు అందని విధంగా సినిమా ఉంటుందని, కచ్ఛితంగా ఈ సినిమాతో దేశం గర్వించేలా చేస్తానని, త్వరలోనే ప్రాజెక్టు కు సంబంధించిన మిగిలిన వివరాలు అనౌన్స్ చేయనున్నట్లు అట్లీ తెలిపాడు.













