Atlee: గురువుని మించిపోయిన అట్లీ
పాన్ ఇండియ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అట్లీ(Atlee) స్టార్ డైరెక్టర్ మురుగదాస్(Murugadoss) శిష్యుడనే విషయం తెలిసిందే. మురుగదాస్ దగ్గర ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేశాడు అట్లీ. అయితే అట్లీ ఇప్పటివరకు ఎప్పుడూ ఫెయిలైంది లేదు. ఇప్పుడు అట్లీ పని చేసే హీరోలంతా స్టార్ హీరోలే. అట్లీ సక్సెస్ చూస్తుంటే అతను తన గురువు మురుగదాస్నే మించిపోయాడనిపిస్తుంది.
అట్లీ నుంచి మొదటిగా వచ్చిన రాజా రాణి(Raja Rani) సినిమా రూ.50 కోట్లు కలెక్ట్ చేయగా రెండో సినిమా తేరీ(Theri) రూ.150 కోట్లు సాధించింది. మూడో సినిమా మెర్సల్(Mersal) రూ.250 కోట్లు, నాలుగో సినిమా బిగిల్(Bigil) రూ.350 కోట్లు కలెక్ట్ చేశాయి. షారుఖ్(Shahrukh) తో అట్లీ(Atlee) చేసిన జవాన్(Jawaan) ఏకంగా రూ.1100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అట్లీ కెరీర్లో మొదటి వెయ్యి కోట్ల సినిమా జవానే.
అట్లీ డైరెక్టర్ అయినప్పటి నుంచి మురుగదాస్ కెరీర్ చూస్తే తుపాకీ(Tuppaki) రూ.120 కోట్లు, హాలీడే(Holiday) రూ.180 కోట్లు, కత్తి(Katthi) రూ. 128 కోట్లు, సర్కార్(Sarkar) రూ.260 కోట్లు కలెక్షన్స్ సాధించాయి. అంటే మురుగదాస్(Murugadoss) అకౌంట్ లో ఇప్పటికీ రూ. 500 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు. మహేష్(Mahesh Babu) తో చేసిన స్పైడర్(Spyder), రజినీ(rajinikanth)తో చేసిన దర్బార్(Darbar) సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజైనా వాటిని అందుకోవడంలో మాత్రం ఫెయిలయ్యాయి. దీన్ని బట్టి చూస్తుంటే డైరెక్టర్ గా సక్సెస్ రేసులో శిష్యుడి కంటే గురువు చాలా వెనుకబడినట్లు అర్థమవుతుంది.













