ఆ ఆశ అలానే ఉండిపోయింది: అశ్వినీదత్
రాజమౌళి(Rajamouli) సినిమాల రేంజ్ ను ఎవరూ టచ్ చేయలేరనే భావన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా బలంగా ఉంది. రాజమౌళిలా భారీ సినిమాలు చేయాలని ప్రయత్నించిన కొందరు ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. కానీ కల్కి(Kalki) సినిమాతో నాగ్ అశ్విన్(Nag Ashwin), వైజయంతీ మూవీస్(Vyjayanthi Movies) అధినేత అశ్వినీదత్(Aswini Dutt) ఇండియన్ స్క్రీన్ పై అద్భుతాన్ని సృష్టించారు.
రాజమౌళి సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా అంతే భారీగా, మంచి గ్రాఫిక్స్ తో వీఎఫెక్స్ తో ఆడియన్స్ కు ఓ గొప్ప అనుభూతిని కల్కి మూవీ అందించింది. బాక్సాఫీస్ వద్ద కల్కి భారీ రికార్డులే క్రియేట్ చేసింది. అయితే ఇంత గొప్ప సినిమా తీసి మంచి హిట్ అందుకున్నప్పటికీ రాజమౌళితో సినిమా తీయాలనే కోరిక మాత్రం తనకు అలాగే ఉండిపోయిందని నిర్మాత అశ్వినీదత్ తెలిపాడు.
రాజమౌళి చేసిన మొదటి సినిమా స్టూడెంట్ నెం.1(Student No.1)కు ఆయనే ప్రెజెంటర్. ఆ సినిమా రాజమౌళికి మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో గొప్పగా తెరకెక్కించాడని, ఇప్పుడు రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడని, ఆయనతో పూర్తి స్థాయి నిర్మాతగా సినిమా చేయాలని అనుకుంటున్నానని, ఇప్పటికీ ఆ ఆశ అలాగే ఉందని అశ్వినీదత్ చెప్పారు. మరి ఆయన ఆశ తీరుతుందో లేదో.













