Ashika Ranganath: మరో సీనియర్ సరసన అమిగోస్ బ్యూటీ
కళ్యాణ్ రామ్(kalyan ram) హీరోగా వచ్చిన అమిగోస్(amigos) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఆషికా రంగనాథ్(ashika ranganath), ఆ సినిమాతో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అమిగోస్ తో సక్సెస్ అందుకోలేకపోయినా అమ్మడికి మంచి ఛాన్స్ అయితే దక్కింది. అక్కినేని నాగార్జున(akkineni nagarjuna) హీరోగా నటించిన నా సామిరంగ(naa samiranga) సినిమాలో నాగ్ కు జోడీగా కనిపించే అవకాశం అందుకుంది.
నా సామిరంగలో హీరోయిన్ గా మంచి మార్కులు వేసుకున్న ఆషికా రంగనాథ్ కు ఆ సినిమాలోని తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ కారణంతోనే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఆషికా. వశిష్ట(Vassishta) దర్శకత్వంలో చిరూ(Chiru) చేస్తోన్న విశ్వంభర(Viswambhara)లో ఆషికా కూడా ఓ హీరోయిన్. సినిమాలో ఆమెది ముఖ్య పాత్రేనని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
అయితే విశ్వంభర ఇంకా రిలీజ్ కూడా కాకుండానే ఇప్పుడు మరో సినిమాలో ఆషికా ఛాన్స్ కొట్టేసిందంటున్నారు. మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా కిషోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ డ్రామాలో ఆషికాను ఎంపిక చేశారని సమాచారం. మొత్తానికి ఆషికా యంగ్ హీరోలను వదిలేసి సీనియర్ హీరోల సరసన నటిస్తూ బాగానే బిజీ అవుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.







