Anushka Shetty: ఘాటీ తర్వాత స్వీటీ ప్లానేంటి?

భాగమతి(Bhagamathie) సినిమా తర్వాత అనుష్క శెట్టి(anushka Shetty) ఎక్కువ సినిమాలు చేసింది లేదు. భాగమతి తర్వాత నిశబ్ధం(Nishabdham), మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr. Polishetty) చేయగా, నిశబ్దం సినిమా మాత్రం అమ్మడికి నిరాశే మిగిల్చింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఆ సినిమా తర్వాత అనుష్క వరుస పెట్టి సినిమాలు చేస్తుందనుకుంటే అమ్మడు మాత్రం సైలెంట్ అయింది.
చాలా గ్యాప్ తర్వాత క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో ఘాటీ(Ghaati) సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి పూర్తి చేసింది. జులై 11న ఘాటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఘాటీతో పాటూ మలయాళ సినిమా కథనర్(Kathanar) లో కూడా అనుష్క నటిస్తోంది. అయితే ఘాటీ రిలీజ్ కు దగ్గర పడుతున్నప్పటికీ ఆ సినిమాకు రావాల్సిన బజ్ మాత్రం రాలేదు.
ఈ పరిస్థితుల్లో అనుష్క ఘాటీ తర్వాత ఏం చేస్తుందనేది ప్రశ్నగా మారింది. ఇప్పటికైతే తెలుగులో ఏ సినిమానూ ఒప్పుకుంది లేదు. ఘాటీ సక్సెస్ అయితే తెలుగులో కంటిన్యూ అవుదామని, లేకపోతే వేరే భాషలపై ఫోకస్ చేయాలని స్వీటీ అనుకుంటున్నట్టు ఓ టాక్ వినిపిస్తోంది. ఎలాగో కథనర్ సినిమాతో మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది కాబట్టి స్వీటీ అక్కడ సినిమాలు కంటిన్యూ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా అనుష్క ఫ్యూచర్ ను ఘాటీ డిసైడ్ చేయబోతుందన్నమాట.