Anupama Parameswaran: అనుపమ ఆశలు ఫలించేనా?

అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) పలు భాషల్లో వరుస సినిమాలను లైన్ లో పెట్టి పలు సినిమాలతో బిజీగా అయితే ఉంది కానీ ఆమె మెయిన్ టార్గెట్ మాత్రం టాలీవుడ్ పైనే ఉంది. టిల్లు స్వ్కేర్(Tillu Square) తో మంచి సక్సెస్ ను అందుకున్న అనుపమ ఆ సక్సెస్ ను సరిగా వాడుకుని క్యాష్ చేసుకోలేకపోయింది. రీసెంట్ గా పరదా(paradha) అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది.
ఆ సినిమా తన కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందనుకుంటే ఆడియన్స్ కనీసం థియేటర్ల వరకు కూడా వెళ్లలేదు. ఇప్పుడు అనుపమ చేతిలో ఉన్న ఒకే ఒక మూవీ కిష్కింధపురి(kishkindhapuri). ఈ సినిమా సక్సెస్ అనుపమకు చాలా కీలకం. ఎందుకంటే ఈ సినిమా హిట్టైతేనే తనకు టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్లు వచ్చి, కొంత కాలం పాటూ నిలదొక్కుకోగలుగుతుంది.
అందుకే అనుపమ ఇప్పుడు తన ఆశలన్నింటినీ కిష్కింధపురి సినిమాపైనే పెట్టుకుంది. నటిగా ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకునే అనుకి కిష్కింధపురిలో మంచి పాత్ర దక్కిందని ముందు నుంచి చెప్తున్నారు. పైగా ట్రైలర్ లో కూడా ఆ విషయం తెలిసిపోయింది. మరి ఈ సినిమా అనుపమకు ఎలాంటి ఫ్యూచర్ ను ఇస్తుందో చూడాలి.