Meera Raj: సౌత్ సినీ ఇండస్ట్రీకి మరో రైజింగ్ స్టార్.. మీరా రాజ్
▪️ ‘కాంచన 4’లో ఛాన్స్ దక్కించుకున్న మీరా రాజ్
▪️ కొత్త అందానికి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ రాఘవ లారెన్స్
▪️ ‘సన్ ఆఫ్’ సినిమాతో టాలీవుడ్లో హాట్ టాపిక్
▪️ ‘తెలుగమ్మాయి’లా స్వయంగా డబ్బింగ్
చూడచక్కని రూపం..గుండె కోసే వలపు సోయగం.. స్క్రీనంతా తళుక్కుమంటూ చెలరేగిపోయే చలాకీదనం.. ఇవన్నీటికి రూపం.. హీరోయిన్ మీరా రాజ్. సౌతిండియా నుంచి వచ్చి దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నటి మీరా రాజ్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ ఆండ్ యాక్టింగ్ ఫర్మార్మెన్స్తోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా ఉన్న మీరా రాజ్.. పాత్రలో లీనమయ్యే విధానం, భాష పట్ల చూపించే నిబద్ధత, కష్టపడే మనస్తత్వం.. ఇవన్నీ మీరాను స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలబెడుతోంది.
మీరా రాజ్ లేటెస్ట్ తెలుగు మూవీ ‘సన్ ఆఫ్’ (Son Of )ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ రెస్పాన్ వస్తోంది. ఈ మూవీలో మీరా చేసిన తన పాత్రకు.. ఆమె స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పింది. ఉత్తర భారతీయురాలైనా, స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణతో డైలాగులు చెప్పి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. “భాష అంటే అభినయానికి ప్రాణం” అన్న భావనను ఆచరణలో చూపించింది మీరా.
ఈ సినిమా తర్వాత మీరా రాజ్ కెరీర్ స్పీడ్‌గా మారుతోంది. తాజాగా ఆమెకు దక్కిన అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ పాన్-ఇండియా చిత్రం కాంచన 4 (Kanchana 4). ఈ మూవీలో పూజా హెగ్డే, రాఘవ లారెన్స్, నోరా ఫతేహి (Pooja Hegde, Raghava Lawrence, Nora Fatehi) లాంటి స్టార్ నటీనటులతో కలిసి నటించడం మీరా రాజ్‌కు బిగ్ ఛాన్స్‌గా చెప్పుకోవచ్చు. ఈ మూవీ డైరెక్టర్ రాఘవ లారెన్స్‌పై మీరా రాజ్‌కు అపారమైన గౌరవం ఉంది.“నా మీద నమ్మకం ఉంచి ఈ పాత్ర ఇచ్చినందుకు లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు ఎప్పుడూ పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శక్తినంతా పెట్టి పనిచేస్తున్నాను” అని మీరా భావోద్వేగంగా చెప్పింది.
ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రంలో తన పాత్రను మరింత సహజంగా మలచుకోవడానికి మీరా ప్రస్తుతం తమిళ భాషను కూడా నేర్చుకుంటోంది. పాత్ర కోసం కొత్త భాషను నేర్చుకోవడమే కాకుండా, సంస్కృతి, మేనరిజమ్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనం.
అందం, అభినయం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం – ఈ నాలుగు లక్షణాల సమ్మేళనమే మీరా రాజ్. చిన్న అవకాశాన్ని పెద్ద విజయంగా మలుచుకునే పట్టుదల ఆమెది. సౌత్ సినిమాల్లోకి ఉత్తరాది అమ్మాయిగా వచ్చి, “మన అమ్మాయే” అనిపించేలా నటించగలగడం అంత సులువు కాదు. కానీ మీరా రాజ్ తనకు అది సాధ్యమని నిరూపిస్తోంది.
ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో సౌత్ స్క్రీన్‌పై మీరా రాజ్ స్టార్ హీరోయిన్గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. సౌత్ సినీ ఇండస్ట్రీకి మరో రైజింగ్ స్టార్‌గా వచ్చేసినట్టే అంటున్నారు ఫ్యాన్స్.






