పీపుల్స్ మీడియా నుంచి మరో బ్యానర్
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యానర్ అంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే. ఈ బ్యానర్ చేతిలో ఉన్న సినిమాల కౌంట్ తెలిస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. రీసెంట్గా 25 సినిమాల మైల్ స్టోన్ ను క్రాస్ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం 20కి పైగా సినిమాలను లైన్లో పెట్టిందంటే ఆశ్చర్యం కలగక మానదు.
ఒక బ్యానర్లో ఒకే టైమ్‌లో ఐదారు సినిమాలు రావడమే ఎక్కువ అనుకుంటాం. అలాంటిది ఈ సంస్థలో ఒకే టైమ్ లో ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు వివిధ దశల్లో ఉండటం అంటే మాటలు కాదు. ఒకప్పుడు చిన్న, మధ్య తరహా సినిమాలనే తీసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలపై కూడా ఫోకస్ చేసింది.
అందులో భాగంగానే రవితేజతో ధమకా, ఈ ఏడాది బ్రో, ప్రభాస్-మారుతి సినిమాలు నిర్మిస్తుంది. ఇదిలా ఉటే ఇప్పుడు ఈ కాంపౌండ్ నుంచి మరో బ్యానర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ లాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు కూడా మరో బ్యానర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ కూతురు ఈ బ్యానర్‌ను హ్యాండిల్ చేయనుందట. తక్కువ బడ్జెట్లో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తీయాలనే లక్ష్యంతో ఈ బ్యానర్‌ను స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త బ్యానర్‌ను లాంచ్ చేయనున్నారని సమాచారం.













