Anirudh: జూన్ లో అనిరుధ సంగీత సునామీ
అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) మ్యూజిక్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్న అనిరుధ్ నుంచి రాబోయే రెండు వారాల్లో సంగీత సునామీ రాబోతుంది. జూన్ నెలలో అనిరుధ్ నుంచి ఏకంగా నాలుగు కొత్త సాంగ్స్ రానున్నాయి. రజినీకాంత్(rajinikanth) హీరోగా చేస్తున్న కూలీ(Coolie) నుంచి ఇప్పటివరకు ఫస్ట్ సింగిల్ రిలీజవలేదు. ఆగస్ట్ లో రిలీజ్ కాబట్టి ప్రమోషన్స్ ను మొదలుపెట్టే క్రమంలో కూలీ ఫస్ట్ సాంగ్ ను ఈ వారం రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.
విజయ్(vijay) లాస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న జన నాయగన్(jana nayagan) నుంచి జూన్ 22న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్ రాబోతుండగా, దానికి అనిరుధ్ నెక్ట్స్ లెవెల్ బీజీఎం ఇచ్చినట్టు తెలుస్తోంది. విజయ్- అనిరుధ్ కాంబోపై అందరికీ మంచి అంచనాలుండటంతో ఈ మ్యూజిక్ కూడా గొప్పగా ఉంటుందని భావిస్తున్నారు. వీటితో పాటూ మురుగదాస్(murugadoss) శివ కార్తికేయన్(siva karthikeyan) తో చేస్తున్న మదరాసి సినిమా ఫస్ట్ సింగిల్ కూడా ఈ నెలలోనే రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.
ఇక ఆఖరిగా విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి(Gowtham thinnanuri) కలయికలో వస్తున్న కింగ్డమ్(Kingdom) సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా జూన్ లోనే రాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే కింగ్డమ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ ను ఈ నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఆల్రెడీ జూన్ లో రెండు వారాలు అయిపోయాయి. మిగిలిన రెండు వారాల్లో అనిరుధ్ నుంచి రానున్న నాలుగు ట్రాక్స్ తో సౌత్ సెన్సేషన్ సునామీ సృష్టించడం ఖాయం.






