ఆ డైరెక్టర్‌కు, అనిరుధ్‌కు భలే సింక్ కుదిరిందిలే
సౌత్‌లో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ జవాన్ సినిమా తర్వాత నార్త్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అతనితో సినిమా చేయించుకోవాలంటే నిర్మాతలకు అదో పెద్ద పని అయిపోయింది. అనిరుధ్ రెమ్యూనరేషన్ ఏకంగా రూ.10 కోట్లకు పైగానే అని టాక్.
అయినా సరే నిర్మాతలు ఆయనతో సినిమా చేద్దామనుకుంటున్నప్పటికీ అతనితో ట్యూన్స్ చేయించుకోవడం, రీరికార్డింగ్ చేయించుకోవడం అంత ఈజీ కాదన్నది వాస్తవం. ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరకు అనిరుధ్ పాటలు ఇచ్చాడో లేదో తెలియదు. షూట్ అయిపోగానే కొరటాల అనిరుధ్ వెంట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంతటి బిజీగా ఉన్న అనిరుధ్, గౌతమ్ తిన్ననూరి అడిగితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడట. జెర్సీ సినిమాతో వీరిద్దరి జర్నీ మొదలైంది. ఆ సినిమాకు అనిరుధ్ ఇచ్చిన బీజీఎం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జెర్సీ తర్వాత వీరిద్దరూ కలిసి విజయ్ దేవరకొండ సినిమాకు పనిచేస్తున్నారు. కానీ ఆ సినిమా షూట్ లేటవుతుండటంతో గౌతమ్ మరో టీనేజ్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు.
సారా అర్జున్ ప్రధాన పాత్రలో రొమాంటిక్ టచ్ తో రూపొందనున్న ఈ సినిమాకు కూడా అనిరుధే సంగీతం అందించనున్నాడు. ఓ పక్క స్టార్ హీరోలు సైతం అనిరుధ్ కోసం వెంట పడుతుంటే వాళ్లను కాదని మరీ గౌతమ్ అడిగాడన్న ఒకే కారణంతో అనిరుధ్ ఈ సినిమా చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే వీరిద్దరి మధ్య బాండింగ్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.













