ఒత్తిడిలో అనిరుధ్.. టెన్షన్ పడుతున్న హీరోల ఫ్యాన్స్
సౌత్ ఇండియన్ మ్యూజిక్ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఇప్పుడెంతో ఒత్తిడిలో ఉన్నాడు. ఓ వైపు దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీగా ఉంది. సెకండ్ లిరికల్ సాంగ్ లేటవడానికి కారణం కూడా అతనే అంటున్నారు. షూటింగ్ అయ్యాక ఫైనల్ కాపీని ఇస్తే ఎప్పటికి రీరికార్డింగ్ పూర్తి చేస్తాడోననే టెన్షన్ తారక్ ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది.
ఇప్పటికే దేవర ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మిగిలిన ప్రతీ పాటను దానికి మించేలా ఉండాలని ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆచార్య బీజీఎమ్ విషయంలో వచ్చిన నెగిటివిటీ ఈసారి దేవర విషయంలో రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో బీజీఎమ్ మీద స్పెషల్ ఫోకస్ చూపిస్తున్నాడట కొరటాల. మరి అనిరుధ్ దేవరకు ఎంత వేగంగా నాణ్యమైన వర్క్ ఇస్తాడో చూడాలి.
దీంతో పాటూ గౌతమ్ తిన్ననూరి కొత్త వాళ్లతో సితార బ్యానర్ లో చేసిన మ్యాజిక్ సినిమా కూడా ఎడిటింగ్ పూర్తి చేసుకుని రెడీగా ఉందట. అనిరుధ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ సినిమాను అనిరుధ్ ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి. మరోవైపు తమిళంలో అజిత్ విదామయార్చి, విఘ్నేష్ శివన్ ఎల్ఐసీ, రజనీకాంత్ వెట్టయాన్, ఇండియన్3 కు కూడా అనిరుధ్ వర్క్ చేస్తున్నాడు. వీటిలో ఏ ఒక్కదాన్నీ పోస్ట్ పోన్ చేయలేడు. ఇంత ఒత్తిడిలో అనిరుధ్ నుంచి ఎలాంటి అవుట్పుట్ బయటకొస్తుందో అని ఆయా హీరోల ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.













