కమల్ కోసం శంకర్ స్టూడెంట్ గా మారిన అనిరుధ్
ప్రస్తుతం సౌత్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ హవా నడుస్తోంది. ఒకే వారంలో రెండు సార్లు అనిరుధ్ టాక్ ఆఫ్ ది మీడియాగా మారాడు. మొన్నటికి మొన్న దేవర సాంగ్ తో ట్రెండ్ అయిన అనిరుధ్, రీసెంట్ గా ఇండియన్2 సాంగ్ తో మరోసారి ట్రెండ్ అవుతున్నాడు. దేవర ఫియర్ సాంగ్ గురించి ఇండస్ట్రీలో, నెట్టింట చాలా పెద్ద చర్చే జరిగింది. మొదట్లో సాంగ్ అర్థం కాలేదని, వీడియోలో ఎన్టీఆర్ కంటే అనిరుధే ఎక్కువగా కనిపించాడని, సాహిత్యాన్ని మ్యూజిక్ డామినేట్ చేసిందని రకరకాల కామెంట్స్ వినిపించాయి.
కానీ పాట మాత్రం వినగా వినగా చాలా బాగా ఎక్కుతుంది. రీసెంట్ గా ఇండియన్2 నుంచి రిలీజైన శౌర సాంగ్ లో ఎక్కడా వాయుద్యాల సౌండ్ లేకుండా శంకర్ ఆలోచనలకు అనుగుణంగా దేశభక్తిని రంగరించి అనిరుధ్ పాటను కంపోజ్ చేయడం ఏ ఆర్ రెహమాన్ ను తలపిస్తుందని సంగీత ప్రియులు అంటున్నారు. ఇలాంటి సాంగ్ కు సుద్దాల అశోక్ తేజతో సాహిత్యాన్ని రాయించడం కూడా పాటకు బాగా ప్లస్ అవుతుంది.
మొత్తానికి ఎలా చూసుకున్నా సరే అనిరుధ్, కమల్ కోసం తన రెగ్యులర్ స్టైల్ ను పక్కనపెట్టి పూర్తిగా శంకర్ రూట్ లోకి వచ్చేశాడనేది మాత్రం అర్థమవుతోంది. జులై 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ ను శౌర సాంగ్ తోనే స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రకుల్ ప్రీత్, సిద్దార్థ్, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













