హీరో, నిర్మాత మధ్య నలిగిపోతున్న డైరెక్టర్
విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వెంకీ76(Venky76) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ముందు అనుకున్న ప్లాన్ ప్రకారమైతే సంక్రాంతికి రిలీజ్ కావాలి. ఆ విధంగానే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది. కానీ తర్వాత జరిగిన పరిణామాల వల్ల లెక్కలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.
ఇప్పుడు సంక్రాంతి రేసులోకి గేమ్ ఛేంజర్(Game Changer) వచ్చింది. ఈ రెండు సినిమాలను నిర్మిస్తుంది దిల్ రాజే(Dil raju) కాబట్టి వెంకటేష్ సినిమాను వాయిదా వేస్తే బావుంటుందనే ఫీలింగ్ బయ్యర్లలో ఉందట. దిల్ రాజు కూడా దానికి సానుకూలంగానే ఉన్నారని టాక్. కానీ వెంకటేష్ మాత్రం పండగ సీజన్ ను మిస్ చేసుకోవడానికి ఇష్టంగా లేడు.
కలిసుందాం రా(Kalisundam Raa), ఎఫ్2(F2) లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సీజన్ ను వదులుకోవాలంటే వెంకీకి ఇబ్బందిగా ఉంది. అనిల్ రావిపూడి మనసులో కూడా ఇదే ఉంది. కానీ దిల్ రాజు మాత్రం ఈ విషయంలో వెంకీని కన్విన్స్ చేసే బాధ్యతను అనిల్ మీద పెట్టినట్లు తెలుస్తోంది. అనిల్ కు మంచి సక్సెస్ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు స్వయంగా అడగడంతో ఆయన మాటను అంత ఈజీగా కాదనలేడు. మరి ఈ విషయంలో అనిల్ ఎలా ముందుకెళ్తాడో చూడాలి. ఏదేమైనా వెంకీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో చాలా ఫైర్ మీదున్నారు. ఒకేసారి రెండు సినిమాలను రిలీజ్ చేస్తే ఏమవుతుందనే రీతిలో వారు మాట్లాడుతున్నారు. కానీ దిల్ రాజు మాత్రం వెంకీ76 ఎప్పుడు రిలీజ్ చేసినా సూపర్ హిట్ అవుతుందనే ధీమాతో ఆ సినిమాను వాయిదా వేయాలనుకుంటున్నాడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరి వెంకీ76 ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి.













