ఇండియన్ సినిమాను వేరు చేయద్దు: అనిల్ కపూర్
నలభై ఏళ్లుగా హిందీ సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నాడు అనిల్ కపూర్. ఒకప్పుడు మిస్టర్ ఇండియా లాంటి సినిమాలతో యూత్ ను ఓ ఊపు ఊపిన అనిల్ కపూర్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్ పాత్రలు చేస్తున్నాడు.
నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో అనిల్ పండించిన విలనిజంకు, యానిమల్ సినిమాలో తండ్రి పాత్రలో ఆయన నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే ఆయన రీసెంట్ గా ఇండియన్ సినిమా అంతా ఒక్కటే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తనకు దక్షిణాది సినిమాలంటే చాలా ఇష్టమన్న అనిల్ కపూర్, తను సౌత్ నుంచే యాక్టర్ గా ఎదిగినట్లు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత బాలీవుడ్ రీమేక్స్ లో నటించినట్లు తెలిపాడు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, పుష్ప లాంటి సినిమాలు దేశ వ్యాప్తంగా మంచి సక్సెస్ ను సాధించాయని అవి దేశాన్ని ఏకం చేశాయని అలాంటప్పుడు బాలీవుడ్ వెర్సస్ టాలీవుడ్ లాంటి మాటలు సరికాదని భారతీయ సినిమాలను వేరు చేయకండని అన్ని సినిమాలను కలిపి ఇండియన్ సినిమాగా చూడమని అనిల్ కోరాడు.













