బాలీవుడ్ లోకి ఎఫ్ 2
తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 80 కోట్ల షేర్‌ను రాబట్టింది. పెళ్లికిముందు..పెళ్లి తరువాత జీవితం ఎలా వుంటుందనే కామెడీ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా వెంకటేశ్, వరుణ్ తేజ్‌లకు భారీ విజయాన్ని అందించింది. తెలుగులో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు, హిందీలో రీమేక్ చేయడానికి రంగంలోకి దిగారు. హిందీలో బోనీకపూర్‌తో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడిగా అనీస్ బజ్మీని తీసుకున్నారు. ఈ సినిమాకి పనిచేయనున్న సాంకేతిక నిపుణుల గురించి నటీనటులను గురించి త్వరలోనే తెలియనుంది.













