అలాంటి వ్యక్తి కోసం వెతుకుతున్నాను
మొదటి నుంచి నాకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. అనుకోకుండా వచ్చాను. చిన్నతనం నుంచి మంచి సైకియాట్రిస్ట్‌ను కావాలన్నది నా కోరిక. అనుకోకుండా ఇలా హీరోయిన్ అయ్యాను అని అంటోంది గాయని, నటి ఆండ్రియా. ప్రస్తుతం నాకు సంగీతం, నటన రెండూ ఇష్టమే. ఏదో ఒకటి చెప్పమంటే మాత్రం చాలా కష్టం. సంగీతాన్ని చిన్నతనం నుంచే నేర్చుకోవడం ప్రారంభించాను. నాటకాల్లో కూడా నటించాను. ఇప్పుడు నాటకాల్లో నటించాలంటే చాలా సమయం కేటాయించాలి. రిహార్సల్స్ చాలా అవసరం. ఇప్పుడు అవన్నీ చేయడం కుదరదు. ప్రేమ, పెళ్లికి ప్రస్తుం దూరం. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరకలేదు. అలాంటి వ్యక్తి కోసం వెతుకుతున్నాను. నాకు స్వతంత్ర భావాలు ఎక్కువ. నా భర్త అయిన సరే నా అవసరాలకు అతన్ని డబ్బు అడగడం నాకు ఇష్టం ఉండదు. నాకు సరిపడా సంపాదించిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను. అది ప్రేమ పెళ్లా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది ఇప్పుడే చెప్పలేను అని పేర్కొంది ఆండ్రియా.













