Andrea Jeremiah: చీరలో మరింత అందంగా ఆండ్రియా
తమిళ నటి అయినప్పటికీ ఆండ్రియా జెర్మియా(Andrea Jeremiah) సౌత్ తో పాటూ నార్త్ లో కూడా నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు యాక్టింగ్, మరోవైపు సింగింగ్ తో ఎంతో బిజీగా ఉండే ఆండ్రియా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే అమ్మడు తాజాగా ఎల్లో కలర్ శారీ, దానికి కాంట్రాస్ట్ గా రెడ్ బ్లౌజ్ ధరించి ఎంతో సంప్రదాయంగా కనిపించడమే కాకుండా చెవులకు బుట్టలు, తలలో రెడ్ కలర్ రోజెస్ పెట్టుకుని సరికొత్తగా మెరిసింది. ఆండ్రియా ఈ ఫోటోల్లో మరింత అందంగా ఉందని కామెంట్స్ చేస్తూ నెటిజన్లు ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.






